అనుష్కని కాదు... మరి ఎవర్ని ప్రేమిస్తున్నట్టు..?

By Gowthami - August 27, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ పెళ్లి విష‌యం టాలీవుడ్‌లో ఎప్ప‌టి నుంచో హాట్ టాపిక్‌. ఈ పెళ్లి గురించి ఎప్పుడు ప్ర‌స్తావ‌న వ‌చ్చినా ప్ర‌భాస్ చిరు న‌వ్వుతోనే స‌మాధానం చెబుతుంటాడు. పైగా అనుష్క‌తో లింకులు పెట్టి చాలా న్యూస్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తున్నా - ఎప్ప‌టిక‌ప్పుడు పుడుతూనే ఉన్నాయి. `సాహో` ప్ర‌మోష‌న్ల సంద‌ర్భంలోనూ ఇలాంటి ప్ర‌శ్న‌లే ప్ర‌భాస్‌కి ఎదుర‌య్యాయి.

 

అనుష్క త‌న‌కు స్నేహితురాలు మాత్ర‌మే అని మ‌రోసారి గ‌ట్టిగా క్లారిటీ ఇచ్చాడు. నిజంగా అనుష్క‌ని ప్రేమిస్తే చెప్పేసేవాడిన‌ని, ఇన్నాళ్లు దాగేది కాద‌ని చెబుతున్నాడు ప్ర‌భాస్. ఈ రూమ‌ర్లు విని ఇంట్లోవాళ్లు కూడా బాధ ప‌డ్డార‌న్నాడు. కాక‌పోతే.. త‌న‌ది మాత్రం క‌చ్చితంగా ప్రేమ వివాహ‌మే అవుతుంద‌ని మ‌రో ట్విస్టు ఇచ్చాడు. అంటే ప్ర‌భాస్ ఇప్పుడు ఆల్రెడీ ప్రేమ‌లో ఉన్నాడ‌న్న‌మాట‌.

 

మ‌రి ఆ అమ్మాయి ఎవ‌రో మ‌రి..? అనుష్క‌ని కాదంటున్న ప్ర‌భాస్ ఎవ‌రిని ప్రేమిస్తున్న‌ట్టు? ఈ విష‌యం ఇంట్లో వాళ్ల‌కీ తెలుసా? అనేది మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఏ హీరోయిన్‌ని ప్రేమించినా అది అనుష్క మేట‌ర్‌లా.. ర‌చ్చ ర‌చ్చ అయిపోయేది. అంటే.. ప్ర‌భాస్ ప్రేమిస్తున్న‌ది సెల‌బ్రెటీని కాదు. ఓ సాధార‌ణ‌మైన అమ్మాయిని. మ‌రి ఆ అమ్మాయి ఎవ‌రో తెలియాలంటే ప్రభాస్ గుట్టు విప్పాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS