'సాహో' షాకింగ్‌ అప్‌డేట్‌ విన్నారా?

మరిన్ని వార్తలు

అమ్మాయిల గుండెల్లో రొమాంటిక్‌ హీరోలా, డార్లింగ్‌గా గూడు కట్టేసుకున్నాడు ప్రబాస్‌. ఆ మాటకొస్తే, అందరికీ ప్రబాస్‌ డార్లింగే. అయితే, 'సాహో' సినిమాలో నన్ను చూశాక, అమ్మాయిలు నన్ను హేట్‌ చేస్తారు.. అని ఇటీవల బాలీవుడ్‌ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ప్రబాస్‌ చెప్పాడు. ఆ మాటకి అర్ధమేంటో అప్పుడు తెలియలేదు. కానీ, ఇప్పుడర్ధమవుతోంది. ప్రముఖ రివ్యూ రైటర్‌ ఉమర్‌ సింధు గురించి తెలియని వారుండరు.

 

ఏ పెద్ద సినిమా విడుదలవుతుందన్నా, మొట్ట మొదట రివ్యూ రాసేది ఆయనే. ఆయన తాజాగా 'సాహో'కి రివ్యూ ఇచ్చేశారు. ఈ రివ్యూ సారాంశం ప్రకారం 'సాహో' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడం ఖాయమని ఆయన తేల్చేశారు. అయితే, ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఉమర్‌ సింధు రివీల్‌ చేశారు. ఈ సినిమాలో ప్రబాస్‌ది నెగిటివ్‌ రోల్‌ అనీ ఆయన చెప్పారు. అంటే మొన్న ప్రబాస్‌ చెప్పిన మాటల్లోని అర్ధం ఇదే కావచ్చు కదా.

 

ప్రబాస్‌ నెగిటివ్‌ రోల్‌ అయితే, మరి హీరో ఎవరు? ఓకే ఈ యాంగిల్‌ నుండే మరో అనుమానానికీ తెర పడినట్లయ్యింది. 'సాహో'లో ప్రబాస్‌ డబుల్‌ రోల్‌ అనే ప్రచారం జరిగింది. తాజాగా ఉమర్‌ సింధు మాటల ప్రకారం, ఖచ్చితంగా ప్రబాస్‌ డబుల్‌ రోలే అని ఫ్యాన్స్‌ ఫిక్సయిపోతున్నారు. మరో నాలుగు రోజుల్లో 'సాహో' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో ఈ సినిమాపై ఊహించని ఈ ఫ్రెష్‌ అప్డేట్‌ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెంచేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS