ప్రభాస్ ఉన్నంత బిజీగా ఏ హీరో లేడేమో..? ఎందుకంటే తన చేతిలో అన్ని సినిమాలున్నాయి. ప్రాజెక్ట్ కె, సలార్, ఆదిపురుష్, మారుతి సినిమా.. ఇలా ఊపిరి సలపనంత బిజీగాఉన్నాడు. ఇటీవల.. మారుతి సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లు పూర్తి చేశాడు ప్రభాస్. ఆ తరవాత ప్రాజెక్ట్ కె షూటింగ్ లో విరామం లేకుండా పాల్గొన్నాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ కెని తాత్కాలికంగా పక్కన పెట్టాడు. దానికి కారణం... `సలార్`కి డేట్లు ఎడ్జిస్ట్ చేయాల్సి రావడమే.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. జనవరి మొదటి వారంలో `సలార్` కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా పాల్గొంటున్నాడు. అందుకే... `ప్రాజెక్ట్ కె` షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చాడు ప్రభాస్. జనవరి అంతా.. సలార్ తోనే బిజీ. ఆ తరవాత.. మారుతి సినిమాకి కొన్ని డేట్లు ఇచ్చాడని టాక్. నెలలో 30 రోజులు ఉంటే చెరో పది రోజులూ ఈ మూడు సినిమాలకూ కేటాయించాలని ప్రభాస్ నిర్ణయించుకొన్నాడని టాక్. `ఆదిపురుష్`కి సంబంధించిన ప్రభాస్ పార్ట్ ఎప్పుడో పూర్తయిపోయింది.