'చందమామ'లో 'డార్లింగ్‌'కి నచ్చని విషయమేంటో తెలుసా ?

మరిన్ని వార్తలు

'బాహుబలి'కి ముందు కాజల్‌తో ప్రబాస్‌ నటించిన చిత్రాలు 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'. రెండూ హిట్‌ చిత్రాలే. కాజల్‌, ప్రబాస్‌ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ ఫ్యాన్స్‌కి గిలిగింతలు పుట్టించింది. అక్కడి నుండే ప్రబాస్‌ డార్లింగ్‌గా అందరి మదినీ దోచేశాడు. అమ్మాయిలతో పాటు, అబ్బాయిల మనసులో కూడా డార్లింగ్‌ అనే ముద్ర వేయించుకున్నాడు. ఇక ఆ తర్వాత ప్రబాస్‌ 'బాహుబలి'తో యూనివర్సల్‌ స్టార్‌ అయిపోయాడనుకోండి.

 

అది వేరే సంగతి. ఇక ఇప్పుడు ఇండియా మొత్తం ప్రబాస్‌ 'సాహో' కోసం ఎదురు చూస్తోంది. 'సాహో' రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డార్లింగ్‌ హుషారుగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. సినిమా గురించే కాక, తన పర్సనల్‌ ఇష్యూస్‌ కూడా ఈ సందర్భంగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ఆ క్రమంలో కాజల్‌ గురించి ప్రబాస్‌ని అడగ్గా, కాజల్‌ అందంగా ఉంటుంది.

 

చాలా యాక్టివ్‌గా ఉంటుంది.. మంచి నటి అని చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే, కాజల్‌ గురించి ఆసక్తికరమైన నిజమొకటి చెప్పాడు ప్రబాస్‌. కాజల్‌ అందంగా ఉంటుంది కానీ, ఆమెకు డ్రస్‌ సెన్స్‌ లేదన్నాడు. మొదట్లో కాజల్‌ వేసుకునే డ్రస్సులు అస్సల తనకి నచ్చేవి కాదనీ, అయితే, ఇప్పుడు కాజల్‌ డ్రస్‌ సెన్స్‌లో చాలా మార్పొచ్చిందనీ డార్లింగ్‌ చెప్పాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS