విశ్వక్ సేన్.. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ పాపులారిటీ సంపాదించిన యంగ్ హీరోల్లో ఒకరు. తాజాగా ‘హిట్’ సినిమాతో సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను త్వరలో డైరెక్షన్ చేయబోతున్నట్లు చెప్పాడు. తనలోని యాక్టర్ కంటే, తనలోని డైరెక్టరే ఎక్కువ స్మార్ట్ అనీ, ఎప్పుడూ డైరెక్షన్ ఆలోచనలే చేస్తుంటాననీ అన్నాడు విశ్వక్ సేన్. సరిగ్గా ఏడాదిన్న వరకు సినిమాల్లో నటిస్తాననీ, ఆ తర్వాత దర్శకుడిగా ఓ సినిమా తీస్తాననీ చెప్పాడు విశ్వక్ సేన్.
ఫలక్‌నుమా దాస్’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన విశ్వక్ సేన్, ‘ఆటిట్యూడ్ దాస్’ అన్న గుర్తింపుని సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. ‘నా మాట కొంచెం స్ట్రెయిట్‌గా.. హార్డ్‌గా వుంటుంది.. అది కొన్ని సార్లు కొందరికి నచ్చకపోవచ్చు.. కానీ, నేనెవర్నీ హర్ట్ చేయాలనుకోను.. నాది చాలా ఫ్రెండ్లీ నేచర్.. చాలా తొందరగానే ఇతరులతో కలిసిపోతాను..’ అని చెప్పాడు విశ్వక్ సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘ఫాల్తూ’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. ఇది కాక మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయి. ఓ ప్రముఖ దర్శకుడు విశ్వక్ సేన్ కథా నాయకుడిగా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కాగా, ‘జార్జి రెడ్డి’ సినిమాలో తాను నటించి వుంటే బావుండేదనీ, ఆ సినిమాలో హీరో పాత్ర తనకు బాగా నచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు విశ్వక్ సేన్.