మైండ్ బ్లోయింగ్ అనేలా 'ఆర్ఆర్ఆర్' నుండి లుక్స్ రిలీజయ్యాయి. అయితే, ఇవి చిత్రయూనిట్ నుండి అధికారికంగా రిలీజైన్ లుక్స్ ఎంత మాత్రమూ కావు. అభిమానులు డిజైన్ చేసిన అద్భుతమైన లుక్స్ ఇవి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసినా ఇంత అద్భుతంగా డిజైన్ చేయలేవేమో. అచ్చం ఒరిజినల్ లుక్స్‌ని తలపిస్తున్నాయి. నెట్టింట్లో ఈ లుక్స్ ఇప్పుడు ట్రెండింగ్ అయ్యాయి. 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ యంగ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌కి యంగ్ వెర్షన్‌గా కనిపించనున్నారని రాజమౌళి ఎప్పుడో అనౌన్స్ చేశాడు.
ఆ చరిత్ర కారులు మనకు సుపరిచితులే కావడం అభిమానులకు ఈ లుక్స్ డిజైన్ చేయడం చాలా సులువైపోయింది. మామూలుగానే టైటిల్ అనౌన్స్‌మెంట్ అయితేనే, తమ అభిమాన హీరోల లుక్స్ ఇలా ఉండబోతున్నాయి. అలా ఉండబోతున్నాయి. ఇలా ఉంటే బావుంటుంది.. అనుకుని సోషల్ మీడియాలో తమ డిజైనింగ్ టాలెంట్‌కి తెగ పదును పెట్టేసే క్రియేటర్స్, ఇక తెలిసిన చరిత్ర కారుల డిజైన్లపై దృష్టి పెడితే ఇదిగో ఇలాగే ఉంటుంది మరి. నిజంగానే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. జక్కన్నే అవాక్కయ్యేలా ఉన్నాయి ఈ లుక్స్. ఫ్యాన్స్ క్యూరియాసిటీని అర్ధం చేసుకుంటే, రాజమౌళి ఇప్పటికైనా ఒరిజినల్ లుక్స్‌ని రిలీజ్ చేయడంపై దృష్టి పెడతాడేమో చూడాలిక.