కృష్ణంరాజు.. ప్రభాస్‌కి గాడ్ ఫాదర్. కృష్ణంరాజు వల్లే.. ప్రభాస్ టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కి చాలా గౌరవం. ప్రేమ. తన ప్రతీ సినిమా విషయం.. పెదనాన్నతో చర్చిస్తూనే ఉంటాడు. అయితే కృష్ణంరాజుకి సంబంధించిన ఓ వార్త ప్రభాస్ అభిమానుల్ని కలవరపెడుతోంది.
అదేంటంటే.. ప్రభాస్ సినిమా `ఆది పురుష్`లో కృష్ణంరాజు నటిస్తున్నాడట. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నాడన్నది వార్తల సారాంశం. ప్రభాస్ - కృష్ణంరాజులు ఒకే తెరపై కనిపించడం నిజంగా ఆనందించే విషయమే. కానీ.. వీరిద్దరి విషయంలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఇది వరకు బిల్లా, రెబల్ సినిమాల్లో వీరి కాంబినేషన్ చూశారు అభిమానులు. కానీ ఆ రెండు సినిమాలూ ఫ్లాపే. మరోసారి `ఆది పురుష్` విషయంలోనూ ఈ బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతుందేమో అని భయపడుతున్నారు. ఆది పురుష్‌లో కృష్ణంరాజు నటించకుండా ఉంటే బాగుండేది అంటూ కోరుకుంటున్నారు. మరి... ఆది పురుష్‌లో కృష్ణంరాజు నటిస్తున్నాడన్న వార్త నిజమేనా? లేదా గాసిప్ మాత్రమేనా అనేది తేలాల్సివుంది. అది నిజమే అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ అవ్వాలని కోరుకోవడం మినహా మరో మార్గం లేదిప్పుడు.