శర్వా ‘ఎన్టీఆర్’ చెయ్యట్లేదు

By iQlikMovies - July 17, 2018 - 16:12 PM IST

మరిన్ని వార్తలు

శర్వానంద్- సక్సెస్ తో పాటుగా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకడు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరోకి ఈమధ్యనే ఒక చిత్రం రూపంలో బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా వార్తలొచ్చాయి.

ఇంతకి ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే- ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్ర (యువ ఎన్టీఆర్)లో నటించేందుకు శర్వాకి అవకాశం వచ్చిందట. దీనితో ఆయనకి తన కెరీర్ లో ఒక మైలురాయి లాంటి పాత్ర దొరికింది అని అందరూ అభిప్రాయపడ్డారు.

అయితే ఆ పాత్రకి సంబందించి పూర్తిగా ఆలోచించాక ఈ సినిమా చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చాడట. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే- అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చేయడం అంత సులువు కాదని నిర్ణయానికి వచ్చాడట.

దీనితో ఈ యంగ్ హీరో ఎన్టీఆర్ బయోపిక్ లో మనకి కనిపించినట్టే. ఇక విద్యా బాలన్ రేపటి నుండి ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ లో పాల్గొనబోతుంది అని సమాచారం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS