'బాహుబలి' సినిమాతో యూనివర్సల్ స్టార్‌గా ఎదిగిన ప్రబాస్, తన ఐదేళ్ల కెరీర్‌ని కేవలం 'బాహుబలి' సినిమా కోసమే కేటాయించాల్సి వచ్చింది. అయినా కానీ ఈ ఐదేళ్లలో పది సినిమాలు చేసినా దక్కని సక్సెస్ ఒక్క 'బాహుబలి'తోనే సొంతం చేసుకున్నాడు ప్రబాస్. ఈ గుర్తింపు జీవితానికిచ్చిన ఓ అరుదైన అవకాశం అంటున్నాడు ప్రబాస్. అయితే ఇకపై ఏ సినిమాకి ఇంత టైం తీసుకోననీ, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తాననీ, అభిమానుల్ని అలరిస్తాననీ అంటున్నాడు ప్రబాస్.
'బాహుబలి' సినిమాతో ప్రపంచంలోని అనేక భాషల్లో ప్రబాస్‌కి గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపుతో, తనకు ఏ భాష నుండి ఛాన్సొచ్చినా నటించేందుకు సిద్ధంగా ఉన్నాననీ అంటున్నాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ నుండి ప్రబాస్‌కి అవకాశాలు వస్తున్నట్లుగా సంకేతాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో నటించేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటున్నాడట. హిందీ భాషపై పూర్తిగా అవగాహన పెంచుకుంటున్నాడట.ఒకవేళ హిందీ చిత్రాల్లో నటించాల్సి వస్తే, ధారాళంగా తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పుకునేలా భాషపై పట్టు సాధిస్తున్నాడట ప్రబాస్.
ఇప్పటికే భళ్లాలదేవ పాత్రలో నటించిన రానా బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. హిందీతో పాటు, ఇంగ్లీష్, తమిళ, మలయాళ చిత్రాలతోనూ బిజీగా ఉన్నాడు రానా. ప్రబాస్ కూడా త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతునాడనిపిస్తోంది. ఇకపోతే తెలుగులో ప్రస్తుతం ప్రబాస్ 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రబాస్ కోసం ఈ ఈ సినిమాకి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ దిగొచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.