యాంకర్‌ ప్రదీప్‌తో ప్రభాస్ త్వరలో?

మరిన్ని వార్తలు

అదేంటీ.. యాంకర్‌ ప్రదీప్‌కీ, ప్రబాస్‌కీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా.? అవునండీ నిజమే, యాంకర్‌ ప్రదీప్‌తో, ప్రబాస్‌ త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నాడట. ప్రదీప్‌ యాంకరింగ్‌లో జీ తెలుగులో 'కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా' అనే షోకి ప్రబాస్‌ గెస్ట్‌గా రానున్నాడట. అదేంటీ. డార్లింగా.? బుల్లితెరపైనా.? అని ఆశ్చర్యపోతున్నారా.? అవును సినిమా ప్రమోషన్స్‌లో తప్ప పెద్దగా ప్రబాస్‌ ఎక్కడా కనిపించిన దాఖలాల్లేవు. సినిమా ప్రమోషన్స్‌లో కూడా అరుదుగానే కనిపించే ప్రబాస్‌ టీవీ షోలో దర్శనమివ్వడమేంటీ.? అనుకోకండి. డబుల్‌ ధమాకా అన్నమాట. ప్రబాస్‌ నటిస్తున్న 'సాహో' త్వరలో విడుదల కానుంది కదా.

 

ఈ సినిమా హక్కుల్ని జీ గ్రూప్‌ వారు భారీ మొత్తంలో కొనగోలు చేశారట. సో, ఆ మొహమాటంతోనే ప్రబాస్‌ ఈ షోకి రానున్నాడనీ తెలుస్తోంది. అయితే, ఈ షోకి రావడం వల్ల ప్రబాస్‌కి పుణ్యం, పురుషార్ధం రెండూ కలిసొచ్చేస్తాయిలే. 'సాహో' సినిమా ప్రమోషన్స్‌ ఓ పక్క, సెకండ్‌ సిరీస్‌లో ఈ షోకి ఫస్ట్‌ రాబోతున్న హ్యాండ్‌సమ్‌ హంక్‌ ప్రబాసే కానున్నాడట. అలా రెండు రకాలా కలిసొస్తుందన్న మాట. 'సాహో' ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS