ఫేక్‌ ట్వీట్‌తో చిన్మయికి మరో షాక్‌.!

మరిన్ని వార్తలు

సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మంచి పేరు దక్కించుకున్న చిన్మయి శ్రీపాద ఈ మధ్య ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలవాలనుకుంటోంది. ఆమె క్రియేట్‌ చేస్తున్న కాంట్రవర్సీలు ఆమె కెరీర్‌ని ఇప్పటికే దారుణంగా దెబ్బ తీసేశాయి. అయినా కానీ, ఆమె వెనుకడుగు వేయడం లేదు. ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కారణంగా ఏం సాధించాలనుకుంటోందో చిన్మయికి తెలీదు కానీ, ఆమె ప్రాణానికి ఇప్పుడో కొత్త తంటా వచ్చి పడింది. ట్విట్టర్‌ చేతిలో ఉంది కదా.. అని చేతికొచ్చిన ట్వీట్‌ చేస్తే ఇలాగే ఉంటుంది మరి.

 

అసలు వివరాల్లోకి వెళితే, యూపీ పోలీసులకు చిన్మయి సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులతో పెట్టుకుంటే మాటలా మరి. ఇంతకీ చిన్మయి చేసిన తప్పేంటంటే, ఓ యూపీ పోలీసు అత్యాచార బాధితురాల్ని తన కోరిక తీర్చమని ఫోర్స్‌ చేశాడంటూ ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. ఆ పోస్ట్‌కి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఎలా.? అని రెస్పాన్స్‌ ట్వీట్‌ కూడా పెట్టింది. దానికి యూపీ పోలీస్‌ వారు స్పందించి, ఇది ఫేక్‌ పోస్ట్‌ అని తమ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. అయినా ఇది ఎప్పుడో 2017లో జరిగిన ఇష్యూ.

 

అప్పుడే ఈ కేసు విషయమై పూర్తి విచారణ చేసి, విచారణ అనంతరం అది ఫేక్‌ న్యూస్‌ అని తేల్చేశారు.. అప్పటి న్యూస్‌ ఇప్పుడు ఓ సెలబ్రిటీ ఇలా షేర్‌ చేసి రచ్చ చేయడం తగదని యూపీ పోలీసులు పేర్కొన్నారు. దానికి వెంటనే మళ్లీ చిన్మయి స్పందిస్తూ, ఆ పోస్ట్‌ని డిలీట్‌ చేస్తూ, 'సారీ.. ఈ ట్వీట్‌ చేసినందుకు క్షమించండి..' అంటూ సమాధానమిచ్చింది. ఈ రకంగా మరోసారి చిన్మయి నెటిజన్స్‌కి టార్గెట్‌ అయ్యింది. ఈ ఫేక్‌ ట్వీట్‌ చేసినందుకు యూపీ పోలీసులు ఆమెను క్షమించారేమో కానీ, నెటిజన్లు మాత్రం ఎప్పటిలాగే ఆడేసుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS