ట్విట్టర్ లోనూ తిరుగులేని ప్రభాస్

మరిన్ని వార్తలు

ప్రభాస్ రేంజ్ నానాటికి పెరిగిపోతోంది. ఎల్లలు దాటి, దేశాలు దాటి అభిమానుల్ని సొంతం చేసుకుంటున్నాడు. అన్నిటిలోను నంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన  బాహుబలి సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. సలార్ సూపర్ హిట్ తో తన రేంజ్ ఇంకా పెంచుకున్నాడు. నెక్స్ట్ కూడా వరస క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఒక వైపు భారీ పారితోషికం తీసుకునే హీరోగా రికార్డ్ సాధిస్తూ, ఇంకో వైపు అన్ని భాషల్లోను ఫాన్స్ ని, ఫాలోవర్స్ ని పెంచుకుంటూ, అన్నిటిలో నంబర్ వన్ గా నిలుస్తున్నాడు ప్రభాస్.


ఇప్పుడు కూడా ట్విట్టర్ మోస్ట్ యూజ్డ్ హాష్ టాగ్స్ టాప్ టెన్ లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఇందులో ఇండియా తరపున యాక్టర్స్ లో ప్రభాస్ ఒక్కరే ఉండటం విశేషం. ఖాన్ త్రయం ఎవ్వరు లేకపోవటం గమనార్హం. ఆ మాటకొస్తే ఇండియన్ చిత్ర పరిశ్రమకి సంబంధించిన వారెవ్వరూ లేరు. # న్యూ ప్రొఫైల్ పిక్ మొదటి ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ లో క్రిప్టో కరెన్సీ ఉంది.  తమిళ స్టార్ విజయ్ నటించిన లియో మూవీ మూడో ప్లేస్ లో ఉంది. 5 ,6 , ప్లేస్ లలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్, మూవీస్ ఉన్నాయి. 7 th  ప్లేస్ లో ప్రభాస్ నిలిచాడు. అంతే కాదు ప్రభాస్ నటించిన ఆది పురుష్ కూడా టాప్ టెన్ లో 9th  ప్లేస్ లో నిలిచింది.


ఇండియా టాప్ టెన్ హాష్ టాగ్ పేరిట చేసిన సర్వేలో డిజిటల్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో ప్రభాస్ వ్యక్తి గతంగా టాప్ 7 లో ఉండటమే కాకుండా, టాప్ 9 లో తన మూవీ కూడా ఉండటం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఇది తెలిసిన డార్లింగ్ ఫాన్స్ మన స్టార్ రేంజ్ అదీ అని మురిసిపోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS