హైప్ కోస‌మే సంజూని వాడుకొంటున్నారా?

మరిన్ని వార్తలు

పుష్ష 2లో సంజ‌య్ ద‌త్ న‌టించ‌బోతున్నాడ‌న్న ప్ర‌చారం కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. సంజూ భాయ్ ఈ క‌థ‌లోకి వ‌స్తే ఈ సినిమాపై క్రేజ్ పెర‌గ‌డం ఖాయం అని ఫ్యాన్స్ కూడా న‌మ్ముతున్నారు. నిజానికి... పుష్ష 2 మొద‌లెట్టేట‌ప్పుడు కొత్త పాత్ర‌ల్ని చేర్చాల‌న్న ఆలోచ‌న సుకుమార్‌కి లేనే లేదు. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలోనూ చెప్పాడు సుకుమార్‌. జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌ని మిన‌హాయిస్తే కొత్త పాత్ర‌ల్ని రాసుకోలేదు. పుష్ష 1కీ  పుష్ష 2కీ జ‌రిగిన ఒకే ఒక్క మార్పు.. జ‌గ్గూభాయ్ మాత్ర‌మే. మ‌రి ఈ సంజూ భాయ్ ఎక్క‌డి నుంచి వ‌చ్చాడు?


పుష్ష 2 షూటింగ్ దాదాపు 50 శాతం పూర్త‌యింది. ఇప్ప‌టి వ‌ర‌కూ సంజ‌య్‌ద‌త్ ని ఈ క‌థ‌లోకి తీసుకుక‌రావాల‌న్న ఆలోచ‌నే లేదు. స‌డ‌న్‌గా పుట్టుకొచ్చిందంటే కాస్త డౌట్ ప‌డాల్సిన విష‌య‌మే. క‌థ‌లో అనూహ్య‌మైన మార్పుల్ని చేయ‌డం సుకుమార్ లాంటి ద‌ర్శ‌కుల‌కు ఇష్టం ఉండ‌దు. కానీ... బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని, అక్క‌డ ఈ సినిమాకి మ‌రింత హైప్ తీసుకురావాల‌న్న ఉద్దేశంతో చివ‌రి నిమిషాల్లో ఈ మార్పు చేసి ఉండొచ్చు.


కేవ‌లం క్యారెక్ట‌ర్ల‌ని చేర్చి, సినిమాకి హైప్ తీసుకురావాల‌నుకోవ‌డంతో క‌థ‌కు న‌ష్టం జ‌రుగుతుంది. పోనీ.. క‌థ మ‌రో కొత్త క్యారెక్ట‌ర్‌ని డిమాండ్ చేసింద‌నుకోండి. ఐనా.. సంజ‌య్‌ద‌త్ అనేది స‌రైన ఆప్ష‌నేనా? అనేది మ‌రో అనుమానం. ఎందుకంటే.. దక్షిణాది సినిమాల్లో సంజ‌య్‌ద‌త్ క‌నిపించ‌డం కొత్త విష‌యం ఏమీ కాదు. కేజీఎఫ్ 2 లో సంజూని చూసేశారు. ఇప్పుడు డ‌బుల్ ఇస్మార్ట్‌ లోనూ సంజూ న‌టిస్తున్నాడు. త‌న స్క్రీన్ ప్రెజెన్స్‌ని మ‌న‌వాళ్లు కొత్త‌గా ఫీల‌య్యే అవ‌కాశం లేదు. అలాంట‌ప్పుడు సంజూని పుష్ష‌ టీమ్ ఎలా న‌మ్ముతోందో అర్థం కావ‌డం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS