రాధేశ్యామ్ తరవాత ప్రభాస్ పూర్తిగా రెస్ట్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. ఈమధ్య తను షూటింగుల్లో పాలు పంచుకోవడం మరీ తక్కువైపోయింది. ఓవైపు సలార్, మరోవైపు ప్రాజెక్ట్ కె పనులు జరుగుతున్నా - ప్రభాస్ సెట్లోకి వెళ్లింది చాలా తక్కువ. మరోవైపు ప్రభాస్‌కి ఈమధ్య చిన్న ఆపరేషన్ జరిగింది. అందుకే విశ్రాంతి తీసుకోవడమే బెటర్ అనుకుంటున్నాడు. మేలో సలార్ కొత్త షెడ్యూల్ పట్టాలెక్కాలి. కానీ.. ప్రభాస్ లేకపోవడంతో ఈ షెడ్యూల్ ఆలస్యం అవుతోంది. ఈ వేసవి అయ్యేంత వరకూ ప్రభాస్ రెస్ట్ మోడ్ లోనే ఉంటాడని, ఏ సినిమాకీ కాల్షీట్లు ఇవ్వడం లేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. అందుకే ప్రభాస్ సెట్లోకి ఎప్పుడు వస్తాడా అని నిర్మాతలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మారుతి తో ప్రభాస్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. మే - జూన్‌లలో ఈ సినిమా లాంఛనంగా మొదలవుతుందని అనుకున్నారు. కానీ ప్రభాస్ పరిస్థితి చూస్తుంటే, మారుతి సినిమాకి ఇప్పట్లో డేట్లు ఇచ్చేలా లేడు. ముందు సలార్ పూర్తి చేయాలి. ప్రభాస్ ఫస్ట్ టార్గెట్ ఈ సినిమానే. సలార్ టీజర్ కోసం మహేష్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెలలో టీజర్ రావాల్సివుంది. అయితే ఈ నెలలో విడుదల చేస్తారా, లేదంటే వచ్చే నెల వరకూ ఆగాలా.. అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.