ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు. పాన్ వరల్డ్ స్టార్. తన సినిమాలు ఇప్పుడు ప్రపంచం అంతా విడుదల అవుతున్నాయి. దానికి తగ్గట్టే... హాలీవుడ్ సంస్థలు సైతం ప్రభాస్ పై ఫోకస్ చేశాయి. హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సల్ స్టూడియో ఇప్పుడు ప్రభాస్‌కు టచ్ లోకి వచ్చింది. ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈమేరకు ప్రభాస్ తో యూనివర్సల్ స్టూడియో ప్రతినిధులు సమావేశం కూడా అయ్యార్ట.
యూనివర్సల్ స్టూడియోస్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ పై దృష్టి పెట్టింది. ఇండియన్ స్టార్స్‌తో సినిమాలు చేయాలని భావిస్తోంది. వాటిని హాలీవుడ్ లో విడుదల చేస్తుందా? లేదంటే కేవలం పాన్ ఇండియా సినిమాలుగానే విడుదల చేస్తుందా? అనేది తెలీదు. కాకపోతే.. ఇండియన్ మార్కెట్ లో పాగా వేయాలని బలంగా భావిస్తోంది. అందుకే ప్రభాస్ తో సంప్రదింపులు మొదలెట్టింది. ప్రభాస్ కూడా యూనివర్సల్ స్టూడియోస్‌తో జట్టు కట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు. త్వరలోనే ఓ తీపి కబురు వినే అవకాశం పుష్కలంగా ఉంది.