ప్రభాస్ ని అభిమానులు దేవుడిలా చూస్తుంటారు. ప్రభాస్ ఏం చేసినా వాళ్లకు నచ్చేస్తుంది. అయితే.. కొంతకాలంగా ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని బాగా కలవరపెడుతూ వచ్చింది. బాగా ఒళ్లు చేయడం వాళ్లని ఇబ్బంది పెట్టింది. సోషల్ మీడియాలో లీక్ అయిన కొన్ని ఫొటోలు చూసి `ప్రభాస్ ఏంటి మరీ ఇలా తయారైపోయాడు` అని వాళ్లంతా బెంగ పెట్టుకొన్నారు. ప్రభాస్ కి లుక్ మీద శ్రద్ధ లేదని, ఇలాగైతే కష్టమని చాలామంది యాంటీ ఫ్యాన్స్ పెదవి విరిచారు. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన తరుణం వచ్చేసింది.
ప్రభాస్ స్లిమ్మయ్యాడు. ఎంతగా అంటే.. డార్లింగ్, మిర్చి సినిమాల్లో ప్రభాస్ ఎంత అందంగా ఉండేవాడో అంతలా తయారయ్యాడు. `సీతారామం` ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ వచ్చాడు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ లుక్, డ్రస్సింగ్ స్టైల్, హ్యాట్ చూసి.. అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ ఈమధ్య బాగా ఒళ్లు తగ్గాడు. కానీ.. బయట ఎక్కడా కనిపించలేదు. చాలా కాలం తరవాత ప్రభాస్ ని చూశారు ఫ్యాన్స్. అది కూడా స్లిమ్ లుక్‌లో.
ఈ లుక్ `ప్రాజెక్ట్ కె`కి సంబంధించింది. సలార్‌లో అయితే ప్రభాస్ కాస్త ఒళ్లు చేసి కనిపిస్తాడు. ఏదైతేనేం.. అభిమానులు ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారో, అలానే దర్శనమిచ్చాడు. డార్లింగ్స్ హ్యాపీ.