క్యూట్ భామ మెహ్రీన్ వరుస అవకాశాలతో కెరీర్‌ని బాగానే నడిపిస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళంలోనూ మంచి ఆఫర్స్ దక్కించుకుంటోంది. అంతా బాగానే ఉంది. కానీ, తాజాగా మెహ్రీన్‌పై సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ‘అశ్వథ్ధామ’ మూవీ ప్రమోషన్స్ అట. అదేంటీ ఎప్పుడో రిలీజైపోయినా సినిమా కి ఇప్పుడు ప్రమోషన్స్ గోలేంటి.. అనుకుంటున్నారా.? అవునండీ, ఎప్పుడో రిలీజైపోయింది కానీ, అదేంటో ఈ సినిమా ప్రమోషన్స్‌లో మెహ్రీన్ సరిగ్గా అటెండ్ కాలేదంటూ కొత్తగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. కెరీర్ స్వింగ్‌లో ఉన్న ఈ తరుణంలో తన కెరీర్‌కి ఎలాంటి మచ్చ పడకూడదనే ఉద్దేశ్యంతో మెహ్రీన్ ముందుగానే తనపై వస్తున్న ఈ అసత్యపు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలనుకుంది.
సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యింది. ‘అశ్వథ్థామ’ సినిమా టైమ్‌లో తనకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయనీ చెబుతూ, ‘స్కిన్ ఎలర్జీ కారణంగా కొన్ని ప్రమోషన్స్‌కి అటెండ్ కాలేకపోయాను.. దానికి సంబంధించిన హెల్త్ ప్రిస్క్రప్షన్ చూపించి మరీ నిర్మాతలకు సారీ చెప్పాను. అదే టైమ్‌లో మా తాతగారికి మేజర్ సర్జరీ జరిగింది.
My Statement 🙏🙏🙏 pic.twitter.com/1lvEuwuIYD
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) February 24, 2020
ఆ విషయం కూడా నిర్మాతకు తెలుసు. ఆ విషయాలన్నీ వారు అర్ధం చేసుకున్నారనుకున్నాను కానీ, ఇప్పుడిలా నాపై నెగిటివ్ ప్రచారం చేస్తారని ఊహించలేదని.. మెహ్రీన్ బాధపడింది. అంతేకాదు, ఆ సినిమాకి సంబంధించి తనకూ, తన స్టాఫ్‌కీ రావల్సిన బిల్స్ కూడా చెల్లించకపోయినా ఇంతవరకూ నేనెక్కడా నోరు విప్పలేదు. అలాంటిది ఇప్పుడు నాపై జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని బయటికి రావల్సి వచ్చిందని.. మెహ్రీన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌లో నాగశౌర్య హీరోగా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఓ మోస్తరు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిబడలేకపోయింది.