ప్రభాస్ - రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కోసం `జాన్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆ టైటిలే ఫిక్స్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. అయితే... ప్రభాస్ మాత్రం టైటిల్ మార్చమని చెప్పాడట. జాన్ టైటిల్ మరీ సాఫ్ట్ గా ఉందని, అలాంటిదే మరో రొమాంటిక్ టైటిల్ ఎంచుకోమని దర్శకుడ్ని సూచించాడట.
మరోవైపు సమంత - శర్వానంద్‌ల `96` రీమేక్‌కీ కూడా `జానూ` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. రెండు పేర్లూ ఒకేలా ఉంటే ఇబ్బందని - అందుకే టైటిల్ మార్చడం ఖాయమని సమాచారం. ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా టైటిల్‌ని ప్రకటిస్తారనుకున్నారు. కానీ ప్రభాస్ తాజా నిర్ణయంతో.. కొత్త టైటిల్ కోసం అన్వేషణలో దిగింది చిత్రబృందం. మరి ఈసారి ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి.