2020 సంక్రాంతి పోరు ఉధృతంగా మారుతోంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం ఒకే రోజు విడుదలకు సై అంటున్నాయి. మరోవైపు రజనీకాంత్ దర్బార్ కూడా సంక్రాంతికే వస్తోంది. ఎంత మంచివాడవురా.. పండక్కే రిలీజ్ అవుతోంది. వీటికి తోడు... వెంకటేష్ - నాగ చైతన్యల వెంకీ మామ కూడా సంక్రాంతికే వస్తుందని ప్రచారం జరిగింది. నిజంగా వెంకీ మామ కూడా రంగంలోకి దిగితే - మిగిలిన సినిమాలకు కాస్త కష్టమయ్యేది. ఎందుకంటే... వెంకీమామ నికార్సయిన ఫ్యామిలీ డ్రామా. పైగా మల్టీస్టారర్.
వెంకటేష్‌కి లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. అన్నింటికంటే మించి.. సురేష్ ప్రొడక్షన్స్ చేతిలో చాలా థియేటర్లు ఉంటాయి. అవన్నీ ఆ సినిమాకే వెళ్లిపోతాయి. దాంతో.. మిగిలిన సినిమాలకు ఇబ్బంది ఏర్పడేది. అయితే ఇప్పుడు వెంకీ మామ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయకూడదని డిసైడ్ అయ్యారు. సంక్రాంతి కంటే ముందే ఈ సినిమా రాబోతోందట. బహుశా.. డిసెంబరులో ఈ సినిమాని విడుదల చేసే అకాశాలున్నాయి. సో.. సంక్రాంతి రేసు నుంచి వెంకీ మామ తప్పుకున్నట్టే. మిగిలిన సినిమాలకు ఇది నిజంగా గుడ్ న్యూసే.