టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సాహూ చిత్రాలతో అమాంతం ఫ్యాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఇటు సౌత్ లోనే కాకుండా మొత్తం దేశంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ తదుపరి చొత్రం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్ టెక్నాలజీతో తెరెకెక్కిన 'సాహో' బలమైన ఓపెనింగ్స్ ను కంటిన్యూ చేయకపోవడంతో..సాహో ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమా బాగా సీరియస్ గా సాగడమే అని.. అందుకే ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం చిత్రం 'జాన్' లో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడట ప్రభాస్.
'రాధ కృష్ణ' రాసిన ఈ 'జాన్' స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తోంది. 'పరుచూరి బ్రదర్స్' కూడా స్క్రిప్ట్ లో లోపాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నారట. పరుచూరి బ్రదర్స్ ను ప్రభాసే ప్రత్యేకంగా స్క్రిప్ట్ ను చూడమని చెప్పాడు. అలాగే కామెడీ బాగా రాసే ప్రముఖ రైటర్ 'గోపిమోహన్' కూడా ఈ సినిమా కోసం పని చేస్తోన్నాడు.
మొత్తానికి 'జాన్' హిట్ అవ్వడం కోసం ఇంతమంది రైటర్లు కలిసి కసరత్తులు చేస్తున్నారు మరి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 'జిల్' సినిమా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.