ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందని ప్రచారం సాగుతోంది. అది ఇప్పుడు ఖరారైపోయింది. ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అంతే కాదు... టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. ఈ చిత్రానికి సలార్ అనే టైటిల్ పెట్టారు. సలార్ అంటే లీడర్ అని అర్థమట.
ఫస్ట్ లుక్ ని సైతం విడుదల చేశారు. ప్రభాస్ చేతితో ఓ గన్ ఉంది. మీస కట్టు కూడా కొత్తగా అనిపిస్తోంది. యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. లుక్, టైటిల్ ఆ విషయాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. కన్నడ సినిమా ఉగ్రమ్ కి ఇది రీమేక్ అని ప్రచారం సాగుతోంది.