పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ తీసుకున్న నిర్ణయం పై ఫాన్స్ ఆందళోనగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ప్రభాస్ కెరియర్ మళ్ళీ పుంజుకుంది. సలార్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తో పాటు, క్రేజీ ప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయి. నాగ్ ఆశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి తో మే లో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. మారుతి డైరక్షన్ లో రాజా సాబ్ చేస్తున్నాడు. ఇవి కాక సందీప్ వంగా తో స్పిరిట్, సలార్ పార్ట్ 2, హను రాఘవపూడి సినిమా కమిట్ అయ్యాడు. ఇంత గొప్ప డైరక్టర్స్ కి ఓకే చెప్పి, మంచి లైనప్ తో ఉన్న డార్లింగ్, తన కెరియర్లో అత్యంత డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వటం చర్చ నీయాంశంగా మారింది.
అతను మరి ఎవరో కాదు రాధే శ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ. ఇతను మొదట రచయితగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. కొన్ని సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. జిల్ సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి మార్కులే సంపాదించాడు. ఇది గమనించి ప్రభాస్ రాధాకృష్ణకు అవకాశం ఇచ్చాడు. పూజ హెగ్డే, హీరోయిన్గా నటించిన ఈ మూవీపై ప్రభాస్ ఫాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. మంచి క్లాసిక్ మూవీగా ఉంటుందని ఆశ పడ్డారు. కానీ ఒకటి రెండు పాటలు, విజువల్స్ తప్ప సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.
రాధేశ్యామ్ తరవాత ఇతనికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. రెండేళ్లు తర్వాత మళ్ళీ ప్రభాస్ పిలిచి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఇది విన్న ఫాన్స్ కలవరపడుతున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా అని కామెంట్స్ పెడుతున్నారు. కానీ సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే ఈ సారి తనని డైరక్ట్ చేసే ఛాన్స్ కాకుండా, డైరెక్టర్ రాధాకృష్ణ గోపీచంద్ తో చేయబోయే సినిమాకి ప్రభాస్ నిర్మాతగా ఓకే చెప్పారని తెలుస్తోంది. ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే వీరి కాంబోలో జిల్ వచ్చిన సంగతి తెలిసిందే . ఇప్పుడు ఈ కాంబోకి ప్రభాస్ కూడా తోడు అయ్యాడు.