ప్రబాస్‌ ప్లాన్‌ ఏంటో తెలుసా.!

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమాతో యూనివర్సల్‌ హీరోగా బ్లాక్‌బస్టర్‌ అందుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌ ఇప్పుడు 'సాహో'తోనూ ఆ స్థాయి బ్లాక్‌ బస్టర్‌నే అందుకోవాలని యోచిస్తున్నాడట. లేట్‌ అయినా లేటెస్టుగా వస్తానంటున్నాడు. ఫ్యాన్స్‌ని ఏమాత్రం నిరాశపరచనంటున్నాడు. అదే ధీమాతో 'సాహో' చిత్రానికి ఓకే చేశాడు. 

లేటెస్టుగా విడుదలైన 'సాహో' మేకింగ్‌ వీడియో ఫ్యాన్స్‌లో ఆ అంచనాల్ని ఆల్రెడీ బిల్డప్‌ చేసేసింది. ఇంతవరకూ 'సాహో'పై ఉన్న ఓ మోస్తరు అంచనాల్ని ఆ మేకింగ్‌ వీడియో అమాంతం ఆకాశానికి ఎత్తేసింది. ఇక పక్కా ప్రబాస్‌ నుండి మరో బాహుబలి వంటి విజయం అని ఫిక్సయిపోయారు. చిత్రయూనిట్‌ చేసిన ప్లానింగ్‌ కూడా ఇదే. అందుకే ఎప్పుడో విడుదల కానున్న 'సాహో' చిత్రానికి ఇప్పటి నుండే భారీ ప్రమోషన్స్‌ని ప్లాన్‌ చేసేశారు. 

'బాహుబలి' స్థాయిలో సినిమాపై హైప్‌ పెంచేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారట. మేకింగ్‌ వీడియోకి ఇప్పటికే విజువల్‌ వండర్‌, ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఇంతవరకూ ఇలాంటి విజువల్‌ చూడలేదంటూ కామెంట్స్‌ వచ్చేస్తున్నాయ్‌. భారీ కాస్టింగ్‌, భారీ సెట్టింగ్స్‌, ప్రబాస్‌ స్టార్‌డమ్‌ ఇలా ఈ సినిమాని అన్నీ ప్లస్‌ పాయింట్సే. అందుకే ఆ స్థాయికి తగ్గట్టుగానే సినిమాని ప్రమోట్‌ చేయాలని అనుకుంటున్నారట. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రూపొందుతోంది. 

బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌ ప్రముఖ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, ఎవ్లిన్‌ శర్మ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS