'బాహుబలి' సినిమా తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ప్రబాస్, తర్వాత యంగ్ హీరో సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. 'బాహుబలి' స్టార్‌డమ్‌తో ప్రబాస్ తర్వాతి సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడంతో సుజిత్ సినిమాకి ముందుగా అనుకున్న బడ్జెట్ కన్నా, భారీ బడ్జెట్ వ్యత్యించడంతో 'బాహుబలి'లానే భారీ బడ్జెట్ చిత్రంగా రూపు దాల్చుకుంటోంది 'సాహో'.
ఈ సినిమా షూటింగ్ కోసం మొన్నీ మధ్యనే దుబాయ్ వెళ్లొచ్చిన చిత్ర యూనిట్ ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ప్రత్యేక సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రబాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు ఈ సినిమాలో.
కాగా ఈ సినిమా సంగతి అటుంచితే, ప్రబాస్ తన నెక్స్ట్ సినిమాని ఆల్రెడీ లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. 'జిల్' ఫేం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉంది. ఇప్పుడీ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించే యోచనలో ప్రబాస్ ఉన్నాడట. అది కూడా ఒక నెల అంతకన్నా తక్కువ రోజుల్లోనే ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 'సాహో' షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో కొత్త చిత్రాన్ని కూడా పట్టాలెక్కించి, ఓ పక్క 'సాహో'ని పూర్తి చేస్తూనే, మరో పక్క కొత్త చిత్రం షూటింగ్‌లోనూ పాల్గొనాలనుకుంటున్నాడట ప్రబాస్.
కూల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ తాజా చిత్రంలో ప్రబాస్ సరసన హాట్ బ్యూటీ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.