బిగ్ బాస్ తెలుగు సంచలనాలకి కేంద్రబిందువుగా మారుతున్నది. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి సభ్యులు ఎవ్వరు బయటకి వెళ్ళడం లేదు సరికదా ఇద్దరు కొత్త సభ్యులు ఇంటిలోకి వెళ్ళనున్నారు.
ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో పూజా రామచంద్రన్ ఇంటిలోకి ప్రవేశించగా ఈ సీజన్ లో ఇప్పటికే ఇంటి నుండి నిష్క్రమించిన ఆరుగురిలో ఒకరిని మళ్ళీ తిరిగి ఇంటిలోకి ప్రవేశ పెట్టేందుకు ఇప్పుడు ప్రజల నుండి ఓట్లు స్వీకరిస్తున్నారు.
ఇప్పటివరకు బిగ్ బాస్ లలో ఇలా అదే సీజన్ లో వెళ్ళిపోయిన వారిని మళ్ళీ ఇంటిలోకి అనుమతించడం జరగలేదు, ఈ సీజన్ లో తొలిసారిగా ఇలా చేస్తున్నారు. ఇక ఆ ఓటింగ్ లో ఇప్పుడు నూతన్ నాయుడు, భాను శ్రీ & తేజస్విలు ముందున్నారు.
వీరిలో ఒకరు మళ్ళీ బిగ్ బాస్ లో స్థానం కచ్చితంగా సంపాదిస్తారు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటింగ్ సరళి చూసినా సరే ఈ ముగ్గురిలో ఒకరి మళ్ళీ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు అర్ధమవుతున్నది,
మరి ఈ ముగ్గురిలో ఇంటిలోకి వచ్చే సభ్యుడు/సభ్యురాలు ఎవరు అన్న అంశం ఈ ఆదివారం తేలిపోనుంది.