కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'జంబలకిడిపంబ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మోస్తరు అంచనాలను అందుకుంది.
ఇకపోతే ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బ్యూటీ సిద్దీ ఇద్నానీ. తొలి సినిమాతోనే టాలెంట్ పరంగా మంచి మార్కులే వేయించుకుందీ అందాల భామ. 'జంబలకిడిపంబ' తర్వాత సిద్దీ ఇద్నానీ నటిస్తున్న చిత్రం 'జిగేల్'. అరుణ్ అదిత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ యంగ్‌స్టర్ కూడా అందరికీ సుపరిచితుడే.
'కథ' సినిమాతో ఈ కుర్రాడు హీరోగా తెరంగేట్రం చేశాడు. కానీ 'గరుడవేగ' చిత్రం అరుణ్‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో రాజశేఖర్‌కి సపోర్టింగ్ రోల్ పోషించాడు అరుణ్ అదిత్. ఈ సినిమాతోనే ఆడియన్స్‌లో బాగా రిజిస్టర్ అయ్యాడు. ఇకపోతే తాజా సినిమా విషయానికి వస్తే ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం. అలాగే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌నీ ఈ చిత్రంలో మిక్స్ చేశారు. రిచ్ నిర్మాణ విలువలతో సినిమాని రూపొందిస్తున్నారు. అల్లం నాగార్జున నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.
తొలి సినిమాతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సిద్దీ ఇద్నానీకి 'జిగేల్' మనిపించే హిట్ మరోసారి దక్కుతుందో లేదో చూడాలిక.