ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకీ పెరిగిపోతోంది. ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు ప్రభాస్. మిగిలిన ఏ టాలీవుడ్ హీరోకీ దక్కనంత పారితోషికం ఇప్పుడు ప్రభాస్ కి అందుతోంది.
బాహుబలికి ముందు ప్రభాస్‌పారితోషికం 10 కోట్లే. ఇప్పుడు అది 100 కోట్లయ్యింది. నిజం.. ప్రభాస్ తన కొత్త సినిమాకి ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది,
బాహుబలి తరవాత ప్రభాస్ చేసిన సినిమా సాహో. యూవీ క్రియేషన్స్ రూపొందించిన చిత్రమిది. యూవీ అంటే ప్రభాస్ సొంత సినిమానే. రాధే శ్యామ్ కూడా అంతే.కాబట్టి, ఈ రెండు సినిమాల పారితోషికాన్నీ లెక్కలోకి తీసుకోకూడదు. ఆదిపురుష్ కోసం ప్రభాస్ 75 కోట్లు అందుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. నాగ అశ్విన్ సినిమాకీ ఇదే మొత్తంలో పారితోషికం దక్కించుకుంటున్నాడట. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాతో ప్రభాస్ 100 కోట్ల మైలు రాయిని అందుకోనున్నాడని తెలుస్తోంది. సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న హీరో మరెవ్వరూ లేరు. సినిమా బడ్జెట్ లో 25 శాతం ప్రభాస్ పారితోషికానికే కేటాయిస్తున్నారు. దీన్ని బట్టి.. ప్రభాస్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవొచ్చు.