బంగారం లాంటి ఆఫ‌ర్ కొట్టేశాడు.

By iQlikMovies - May 16, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం కేజీఎఫ్‌. క‌న్న‌డ‌లో రూపొందిన ఈ చిత్రం దాదాపు 250 కోట్లు సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2 రూపొందుతోంది. 2020 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం రావు ర‌మేష్‌ని ఎంచుకుంది చిత్ర‌బృందం. కేజీఎఫ్ 1లో.. తెలుగు న‌టులెవ‌రూ క‌నిపించ‌లేదు. కానీ ఆ సినిమా తెలుగులోనూ సూప‌ర్ హిట్ అయ్యింది.

 

ఈసారి చాప్ట‌ర్ 2లో మాత్రం తెలుగు నటీన‌టుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకుంది. అందుకే రావు ర‌మేష్‌కి ఈ ఛాన్స్ ద‌క్కింది. తెలుగు నుంచి మ‌రింత మంది న‌టీన‌టుల్ని ఎంచుకునే అవ‌కాశం ఉంది. య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం కోసం 150 కోట్ల బ‌డ్జెట్ వెచ్చించిన‌ట్టు స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS