ప్రభాస్21: అదే డార్లింగ్ పాత్రలో ప్రత్యేకత

మరిన్ని వార్తలు

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ 'రాధే శ్యామ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ ఈ సినిమాకు డైలాగ్ వెర్షన్ రాయడంలో బిజీగా ఉన్నారట.

 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ లో నటిస్తున్నారట. అయితే ఈ రెండు పాత్రలు పురాణాల్లోని రెండు కీలక పాత్రల ఆధారంగా డిజైన్ చేసినవని సమాచారం. ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా ఈ పాత్రలను నాగ్ అశ్విన్ ఆధునికంగా తీర్చి దిద్దారట. సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లే హైలైట్ గా ఉంటాయని అంటున్నారు.

 

ప్రభాస్21 సినిమాను వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2022 లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS