డార్లింగ్ ప్రభాస్ 'బాహుబలి' విడుదలకు ముందు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. అయితే 'బాహుబలి' రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు. అంతే కాదు, 'బాహుబలి' ని ఇతర దేశాలలో విడుదల చేయడంతో అక్కడ కూడా విజయఢంకా మోగించింది. అప్పట్లో జపాన్ లాంటి దేశాలలో సంచలనం సృష్టించింది. ఈమధ్య రష్యాలో దుమ్ము దులిపింది. దీంతో రష్యాలో ప్రభాస్ కు చాలామంది అభిమానులు ఏర్పడ్డారట.
ముఖ్యంగా అమ్మాయిల్లో డార్లింగ్ కు విపరీతంగా క్రేజ్ పెరిగిందని, అందుకే కొందరు తమ అభిమానం చూపిస్తూ ప్రభాస్ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుంటున్నారట. అదే కోవలో ఈమధ్య ఒక అభిమాని తన వీపుపై ప్రభాస్ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా హల్చల్ చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇతర టాలీవుడ్ స్టార్ హీరోలకు అందనంత ఎత్తులో ప్రభాస్ ఉన్నాడని మనకు అర్థం అవుతుంది.
ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'రాధే శ్యామ్' లోనూ, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాలోనూ నటిస్తున్నాడు.