ప్రబాస్‌ ఈ ఏడాది కూడా రానట్లేనా?

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమా కోసం కెరీర్‌లో ఐదేళ్లు కేటాయించిన ప్రబాస్‌, తర్వాత నటిస్తున్న చిత్రం 'సాహో'. 'బాహుబలి'తో సంచలన విజయం సాధించి, యూనివర్సల్‌ స్టార్‌ అనిపించుకున్న ప్రబాస్‌ తదుపరి చేయబోయే చిత్రం పైనా అంచనాలు ఆ రేంజ్‌లో ఉండే అవకాశాలు లేకపోలేవు. 

అయితే ప్రబాస్‌ గత ఐదేళ్లుగా 'బాహుబలి' తప్ప మరో గెటప్‌లో ప్రేక్షకులకు కనిపించలేదు. లవర్‌ బోయ్‌ అనే ఇమేజ్‌ నుండి, బాహుబలి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌ 'సాహో' సినిమా కోసం లవర్‌ బోయ్‌లా స్టైలిష్‌ లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ ప్రబాస్‌ ఫ్యాన్స్‌ కూడా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అంటే 2018లో 'సాహో' సినిమా ఉండొచ్చని అంచనా వేశారు. అయితే ఈ ఏడాదికి 'సాహో' వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. యాక్షన్‌ ప్రధానాంశంగా అతి భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

హాలీవుడ్‌ స్థాయిలో ఈ సినిమాలో యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ఇంతవరకూ తెలుగు సినిమాలో ఎప్పుడూ చూడని యాక్షన్‌ సీన్స్‌ని కంపోజ్‌ చేస్తున్నారట. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ ఈ సినిమాకి పని చేస్తున్నారు. దాంతో సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉందని చిత్ర యూనిట్‌ నుండి అందిన సమాచారమ్‌. ఈ సమాచారమ్‌ ప్రబాస్‌ ఫ్యాన్స్‌ని కొంత నిరాశపరిచినా, ప్రస్తుతం ప్రబాస్‌ చేయబోయే సినిమా 'బాహుబలి' స్థాయిని మించకుండా ఉండాలంటే ఆ వెయిటింగ్‌ తప్పదు మరి. బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ ఈ సినిమాలో ప్రబాస్‌తో జత కడుతోంది. యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వంలో 'సాహో' తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS