అచ్చం మేనమామని దించేశాడుగా!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు అన్నందుకు అచ్చం మేనమామలు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లను పోలినట్లుగానే ఉంటాడు సాయి ధరమ్‌తేజ్‌. అయితే ఇంతవరకూ స్టైలింగ్‌లో మాత్రమే మేనమామలను పోలిన మన మెగా మేనల్లుడు ఇప్పుడు రూపు రేఖల్లో కూడా అచ్చం పెద్ద మేనమామ చిరంజీవి పోలికల్లోకి వచ్చేశాడు. 

వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఇంటెలిజెంట్‌' సినిమా నుండి 'లెట్స్‌ డూ నౌ..' సాంగ్‌ వీడియోని చిత్ర యూనిట్‌ లేటెస్టుగా విడుదల చేసింది. సాంగ్‌లో అచ్చం పాతికేళ్లనాటి చిరంజీవి స్టెప్పులేస్తున్నట్లే ఉంది. ఆ గ్రేస్‌, ఆ స్టైల్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ అంతా అచ్చం చిరంజీవినే తలపిస్తున్నాడు. వినాయక్‌ మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో తేజు అచ్చం చిరంజీవిలా కనిపిస్తాడనీ. నిజమే చెప్పాడు వినాయక్‌. జస్ట్‌ సాంగ్‌ ట్రైలర్‌ వీడియో చూస్తేనే తేజు ఇలా ఉంటే, ఇక సినిమా మొత్తంలో చిరంజీవిని ఇంకెంతలా తలపించనున్నాడో అనిపిస్తోంది. 

డాన్సుల్లో ఎలాగూ మెగా మేనల్లుడు ఎప్పుడో ప్రూవ్‌ చేసేసుకున్నాడు. ఇక స్టైలింగ్‌లో కూడా ప్రీ రిలీజ్‌ రెస్పాన్స్‌ అదిరిపోతోంది. ఇదంతా చూస్తుంటే, మొత్తానికి వినాయక్‌ మరోసారి యంగ్‌ ఏజ్‌లో ఉన్న చిరంజీవితో సినిమా తీసినట్లుగా ఫీలయినట్లు అనిపిస్తోంది. ఆ ఎట్మాస్పియర్‌ అంతా సినిమాలో చూపించేలానే ఉన్నాడు. మెగాస్టార్‌ 150వ చిత్రం ఎవరితో తెరకెక్కించాలా? అని ఆలోచనలు చేస్తున్న తరుణంలో అప్పటికి 'అఖిల్‌' వంటి డిజాస్టర్‌ తాజాగా తన ఖాతాలో ఉన్నప్పటికీ, చిరుకి ఎంత నమ్మకం ఉంటే పిలిచి ఆ అద్భుతమైన ఆఫర్‌ని వినాయక్‌ చేతిలో పెడతాడు.. అదీ వినాయక్‌ అంటే. 

అలాంటి వినాయక్‌ చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీలో తనకిష్టమైన హీరో తేజు అని చెప్పాక, తేజుతో తీసే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో ఇంతవరకూ విడుదలైన ప్రోమోస్‌, పోస్టర్స్‌ చూస్తేనే తెలుస్తోంది. ఇక సినిమా రిజల్ట్‌ ఏ రేంజ్‌లో ఉండబోతోందో త్వరలోనే తెలిసిపోనుంది. జస్ట్‌ వెయిట్‌ అండ్‌ సీ!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS