'బాహుబలి' సినిమా తర్వాత ప్రబాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'. 'బాహుబలి' ఎఫెక్ట్‌తో ఈ సినిమాని అనుకున్నదానికి మించి భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సలు సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది. హైద్రాబాద్, దుబాయ్, సింగపూర్, ముంబయ్ తదితర నగరాల్లో రిచ్ లొకేషన్స్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఓ భారీ షెడ్యూల్ కోసం 'సాహో' చిత్రం దుబాయ్‌లో సందడి చేస్తోంది.
సినిమాకి ఇదే లాంగెస్ట్ షెడ్యూల్ అని చిత్ర యూనిట్ గతంలోనే చెప్పింది. అయితే ఈ షెడ్యూల్‌ని మరింత పెంచినట్లుగా తాజా సమాచారమ్. దుబాయ్‌లోని రిచెస్ట్ లొకేషన్స్‌లో భారీ నుండి అతి భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ తెరపై చూసేందుకు చాలా రిచ్‌గా క్లాస్‌గా ఉండబోతున్నాయట. ఇంతకు ముందెన్నడూ తెలుగు సినిమా స్క్రీన్‌పై కనిపించని యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ వేల్యూస్‌ని ఈ సినిమాతో పరిచయం చేయనున్నారనీ తెలుస్తోంది.
'రన్ రాజా రన్' ఫేం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోతో పాటు, హీరోయిన్ అయిన శ్రద్ధాకపూర్‌కి కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయన్న సంగతి తెలిసిందే. ఆ సీన్స్ కోసమే ఈ సినిమాకి హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్‌ని ఏరి కోరి ఎంచుకున్నారు. శ్రద్ధాతో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు, పలువురు బాలీవుడ్ ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.