యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో షూటింగ్ అత్యున్నత స్థాయి నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తవ్వగా ఇంకొన్ని రోజుల్లో ఒక కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.
ఆ వివరాల్లోకి వెళితే, ఏప్రిల్ 10 నుండి దుబాయ్ లోని ప్రముఖ నిర్మాణాలు అయిన భూర్జ్ ఖలీఫా, రసల్ ఖైమా నందు చేజింగ్, యాక్షన్ సీక్వెన్స్ లని చిత్రీకరించబోతున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ అయిన కేన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరగనున్నాయి.
ఇక ఈ షెడ్యూల్ లో హీరో ప్రభాస్ తో పాటు శ్రద్ధా కపూర్, సాహో ప్రధాన తారాగణం మొత్తం కనపడే అవకాశం ఉంది అని యూనిట్ వర్గాల సమాచారం. ఏదేమైనా షూటింగ్ త్వరగా పూర్తయి సినిమా ప్రేక్షకుల ముందుకి రావాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.
చూద్దాం.. ఎన్ని రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తికానుందో..