'బాహుబలీ' ఇది నిజమేనా?

మరిన్ని వార్తలు

'బాహుబలి' చిత్రంతో యూనివర్సల్‌ స్టార్‌ అనిపించుకున్న ప్రబాస్‌ ఈ సారి ఇంటర్నేషనల్‌ దొంగగా మారిపోయాడట. ఎందుకోసమో తెలుసా? 'సాహో' సినిమా కోసం. ఈ సినిమాలో ప్రబాస్‌ క్యారెక్టర్‌ ఇంటర్నేషనల్‌ డైమండ్స్‌ దొంగ అంటూ ప్రచారం జరుగుతోంది. అప్పుడెప్పుడో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ప్రబాస్‌ లుక్‌ కౌబోయ్‌కి కొంచెం దగ్గరగా ఉంది. అలాగే 'కొండవీటి దొంగ' సినిమాలో చిరంజీవి గెటప్‌ని పోలి నల్లని ముసుగులో కనిపించాడు ప్రబాస్‌. 

తాజా ప్రచారానికి ఆ గెటప్‌కీ కూడా దగ్గర పోలిక అనిపిస్తోంది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఆల్రెడీ దుబాయ్‌లో ఈ చిత్రం కోసం ఖర్చు అక్షరాల 90 కోట్లు పై మాటే. టోటల్‌గా అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్‌ నుండి పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.  ముఖ్యంగా బాలీవుడ్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకొచ్చారంటేనే ఆమెకిచ్చే రెమ్యునరేషనే ఇంకెంతుంటుందో ఆలోచించాలి. అలాగే నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. జాకీష్రాఫ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇకపోతే తాజాగా ప్రచారంలో ఉన్న ప్రబాస్‌ గెటప్‌కి సంబంధించి ఆయన అభిమానుల్లో ఆశక్తి నెలకొంది. 'బాహుబలి' తర్వాత ప్రబాస్‌ చేస్తున్న ఈ సినిమాకి యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS