ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న 'సలార్' సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర వుండబోతోంది.. ఆ కీలక పాత్రలో ఓ ప్రముఖ నటుడు నటించబోతున్నాడు. ఆ పాత్రకి కుడి భుజంగా హీరో వుంటాడు. ఓ ప్రముఖ వ్యక్తికి కుడి భుజంగా వుండే హీరో, ప్రజలకు సాయపడే క్రమంలో తనకు ఎదురైన అడ్డంకుల్ని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథాంశమట. ఈ విషయమై దర్శకుడు ప్రశాంత్ చూచాయిగా ఓ ప్రకటన చేసేశాడు. సో, ఇప్పుడు ఈ కీలకమైన పాత్రలో కనిపించే నటుడు ఎవరు.? అన్నది ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నటుడ్ని ఈ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ ఇంపోర్ట్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే, సౌత్ నుంచి ఓ ప్రముఖుడ్ని ఈ పాత్ర కోసం సెలక్ట్ చేయొచ్చన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆ సౌత్ ప్రముఖుడు ఇంకెవరో కాదు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని కూడా అంటున్నారు. అయితే, నటీనటుల ఎంపికకు సంబంధించి ఇంకా ఎలాంటి ముందడుగు పడలేదన్నది 'సలార్' మేకర్స్ వాదన. ప్రస్తుతానికైతే దర్శకుడు, హీరో పేర్లు మాత్రమే ఖరారయ్యాయి. మరిన్ని వివరాలు సంక్రాంతి తర్వాతే వెల్లడవుతాయట.