స్పిరిట్ లో ఇద్దరు ముద్దుగుమ్మలతో డార్లింగ్

మరిన్ని వార్తలు

ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. రాజాసాబ్ కి మారుతి డైరక్టర్ కాగా ఫౌజీ కి హనురాఘవపూడి డైరక్టర్. ఇందులో రాజా సాబ్ మూవీ మార్చ్ లో రిలీజ్ కానుంది. మాక్సిమం 2025 లోనే ఫౌజీ కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనితో సందీప్ వంగా స్పిరిట్ పై ద్రుష్టి పెడుతున్నాడట ప్రభాస్. అర్జున్ రెడ్డితో  ప్రభంజనం సృష్టించిన సందీప్ యానిమల్ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. దీంతో సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. పైగా ప్రభాస్ హీరో కావటంతో అంచనాలకి హద్దులు లేవు.

ప్రభాస్ ఫ్రీ అవగానే సినిమా మొదలు పెట్టెలా సర్వం సిద్ధం చేస్తున్నాడు సందీప్. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసినట్లు అప్డేట్ ఇచ్చాడు. ఇప్పడు హీరోయిన్ సెలక్షన్ లో పడ్డాడట. ఈ మూవీలో త్రిష ఫిక్స్ అని కొన్నాళ్ళు, దీపికా పదుకొనే అని కొన్నాళ్ళు రూమర్స్ గట్టిగా వినిపించాయి. కానీ అవేవీ నిజం కాదని లేటెస్ట్ న్యూస్ ద్వారా తెలుస్తోంది. ప్రభాస్ స్పిరిట్ లో ఇద్దరు పాన్ ఇండియా భామలతో రొమాన్స్ చేయనున్నాడని సమాచారం. ప్రజంట్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో భాగం అవుతున్న రష్మిక మందన్నా, ఇంకొకరు కియారా అద్వానీ.

ఇప్పటికే బాలీవుడ్ లో యానిమల్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకుని, పుష్ప 2 తో మరింత క్రేజ్ పెంచుకుంది రష్మిక. ఇక కియారా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది, తెలుగులో మహేష్, చరణ్ తో నటించి సౌత్ లో కూడా పేరు తెచ్చుకుంది. నెక్స్ట్ చరణ్ తో గేమ్ చేంజెర్ మూవీతో పాన్ ఇండియాలో సత్తా చాటుతోంది. ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరు బ్యూటీస్ స్పిరిట్ లో నటిస్తే పాన్ ఇండియా లెక్కలు సరిగ్గా ఉంటాయని సందీప్ ఆలోచిస్తున్నాడట. ఇంకో విషయం ఈ ఇద్దరు భామలు సందీప్ తో గతంలో వర్క్ చేసిన వారే. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ అందుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS