షేడ్స్‌ ఆఫ్‌ సాహో.. ప్రభాస్‌ ది కింగ్‌!

By iQlikMovies - October 23, 2018 - 12:29 PM IST

మరిన్ని వార్తలు

స్టయిలిష్‌ లుక్‌తో 'షేడ్స్‌ ఆఫ్‌ సాహో' చాప్టర్‌ వన్‌లో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అదరగొట్టేశాడు. ప్రభాస్‌ పుట్టినరోజునాడు 'సాహో' టీమ్‌, ప్రభాస్‌ అభిమానులకు కానుకగా ఈ 'చాప్టర్‌ వన్‌'ని విడుదల చేసింది. 

అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యేలా, ఈ మేకింగ్‌ వీడియో వచ్చింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌కి ఎలా రూపకల్పన జరిగిందీ ఇందులో చూపించారు. హీరోయిన్‌ శ్రద్ధా పూర్‌, యాక్షన్‌ మోడ్‌లో కన్పిస్తోంది. సినిమా కోసం దుబాయ్‌లో చేసిన స్టంట్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి మేకింగ్‌ వీడియోలో. పెద్ద పెద్ద ట్రక్కులనుంచి అతి ఖరీదైన కార్లను దించి, వాటిని ఈ సినిమా కోసం వినియోగించారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తాలూకు మేకింగ్‌ వీడియోలే 'రోమాలు నిక్కబొడుచుకునేలా' చేశాయి. 

'గూస్‌ బంప్స్‌ అంటే ఇవే బాస్‌' అనిపించేలా సన్నివేశాలున్నాయనడం అతిశయోక్తి కాదు. మేకింగ్‌ వీడియో చివర్లో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆ పక్కనే 'హ్యాపీ బర్త్‌ డే' అంటూ అక్షరాలు దర్శనమిచ్చాయి. ప్రభాస్‌ బైక్‌ మీదకు ఎక్కి, రయ్యిన దానిపై దూసుకెళ్ళాడు. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ మేకింగ్‌ వీడియో అదిరిపోయిందంతే. 'షేడ్స్‌ ఆఫ్‌ సాహో' అంటూ సరికొత్తగా సినిమా ప్రమోషన్స్‌ని తీసుకొస్తోన్న 'సాహో' టీమ్‌, తొలి చాప్టర్‌తోనే బీభత్సమైన అటెన్షన్‌ని సాధించింది. 

యంగ్‌ రెబల్‌ స్టార్‌ అభిమానులు 'ది కింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా' అంటూ ప్రభాస్‌ని ఆకాశానికెత్తేస్తూ ఈ ట్రైలర్‌ని వైరల్‌ చేసేశారు. వ్యూస్‌ పోటెత్తుతున్నాయిప్పుడు ఈ చాప్టర్‌కి. సాహో రే ప్రభాస్‌.!

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS