'డార్లింగ్‌' కొత్త అవతారం.!

మరిన్ని వార్తలు

సినీ నటులు వ్యాపార రంగంలోకి విసృతంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నటులు నాగార్జున, చిరంజీవి ఇప్పటికే వాణిజ్య రంగంలో మిత్రులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరి భాగస్వామ్యంలో మాటీవీ అత్యున్నత శిఖరాల్ని అందుకుంది. ఆ తర్వాత అది స్టార్‌ గ్రూప్స్‌లో విలీనమైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో స్టార్‌ హీరో ఈ రంగంలో కాలు మోపనున్నారు. ఆయన మరెవరో కాదు, డార్లింగ్‌ ప్రబాస్‌.

 

ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో ప్రబాస్‌ భాగస్వామి కానున్నాడట. ఆ ఛానెల్‌ త్వరలోనే ప్రారంభం కానుందట. ప్రముఖ నిర్మాతలు కమ్‌ ఫ్రెండ్స్‌ అయిన వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్‌లతో కలిసి ప్రబాస్‌ ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ని స్టార్ట్‌ చేయనున్నారట. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికీ భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. ఓ పక్క నటులుగా కొనసాగుతూనే, మరోపక్క ఈ తరహా వ్యాపారాలు చేసేందుకు మన సినీ తారలు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

 

ఇవే కాదు, విభిన్న రకాల వ్యాపార రంగాల్లో సత్తా చాటుతున్నారు. నాగార్జున, చిరంజీవి తరహాలో ప్రబాస్‌ కూడా ఈ వ్యాపారంలో రాణించాలని ఆశిద్దాం. ఇకపోతే ప్రస్తుతం ప్రబాస్‌ 'సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు, రాధాకృష్ణ సినిమాలోనూ ప్రబాస్‌ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలనూ సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు ప్రబాస్‌. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS