కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అంటూ దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు తీవ్రమైన చర్చలు జరిగాయి. చివరికి దానికి సమాధానం దొరికిందనుకోండి.
అయితే నిన్న ముంబైలో జరిగిన ఓ ప్రైవేటు పార్టీలో, బాహుబలిని కట్టప్ప కత్తితో పొడిచి ఫోజ్ లోనే ప్రభాస్ ని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరదాగా కత్తితో పొడుస్తునట్టు ఫోజ్ ఇచ్చారు.
ఆ టైములో ఎవరో ఫోటో క్లిక్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో అంతర్జాలంలో తెగ సందడి చేస్తున్నది. అయితే ఇప్పుడు వరుణ్ ధావన్ ప్రభాస్ ని ఎందుకు చంపాడు? అంటూ సోషల్ మీడియాలో కొత్త ప్రశ్న వైరల్ అవుతున్నది.
ఏదేమైనా బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ పైన చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు అనడానికి ఇదే నిదర్శనం.