రెబల్ స్టార్ ప్రభాస్ అయిదు సంవత్సరాల కష్టానికి ఫలితంగా ఇంకొక పది రోజుల్లో మనముందుకి బాహుబలి 2 రాబోతుంది. ఇటువంటి తరుణంలో ప్రభాస్ తన అభిమానులకి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వనున్నాడట.
అందుతున్న సమాచారం ప్రకారం, ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టీజర్ బాహుబలి రిలీజ్ తో పాటుగా విడుదల చేయాలనీ ప్లాన్ చేశాడట. అయితే ఈ టీజర్ ని నాలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారట! ఇందుకోసం టీజర్ కి సంబందించిన పని కూడా సుజిత్ & కో మొదలుపెట్టినట్టు సంచారం.
అయితే ఇప్పటికే బాహుబలి తరువాత తను సుజిత్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేయనున్నట్టుగా ప్రకటించేశాడు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన యువీ క్రియేషన్స్ పతాకం పై నిర్మిస్తున్నారు.
ఇన్ని సంవత్సరాల నుండి కేవలం బాహుబలి కే పరిమితమైన ప్రభాస్, ఇప్పుడు మాత్రం ఒకేసారి తన మార్కెట్ ని నాలుగు బాషలకి పెంచుకోవడం చూస్తుంటే ఇదంతా బాహుబలి మ్యాజిక్ అని వేరే చెప్పకర్లేదు గా..