డాన్సర్ గా అడుగుపెట్టి, డాన్స్ మాస్టర్ గా ఎదిగి, ఆ తరవాత నటుడిగా మారి సూపర్ హిట్ లు సొంతం చేసుకున్నాడు ప్రభుదేవా. డాన్స్ కి ఓ కొత్త అర్థాన్ని ఇస్తూ సాగింది తన ప్రయాణం. ఆ తరవాత మెగా ఫోన్ పట్టి, అక్కడా తన సత్తా చాటుకున్నాడు. అయితే ఈమధ్య దర్శకుడిగా ప్రభుదేవా వరుస ఫ్లాపులు అందుకున్నాడు. ఆ ప్రభావం డాన్స్, నటనపై కూడా పడుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుదేవా ఇప్పుడు ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట ప్రభుదేవా మెగా ఫోన్ పట్టడట. కేవలం నటన, డాన్స్పైనే దృష్టి సారించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల సల్మాన్ ఖాన్ తో `రాధే` అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు ప్రభుదేవా. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడమే కాదు, దర్శకుడిగా ప్రభుదేవా సత్తాని ప్రశ్నించింది. ప్రభుదేవా దర్శకుడిగా ఈ సినిమాలో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ప్రభుదేవా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. నటుడిగా ప్రభుదేవా ఫుల్ బిజీ. దాంతో డైరక్షన్ పై దృష్టి పెట్టలేకపోతున్నాడట. సో.. ఇక మీదట ప్రభుదేవాని డైరెక్టర్గా చూడలేమన్నమాట.