రెండో 'చార్లిచాప్లిన్‌' వచ్చేస్తున్నాడు లెట్స్‌ బీ రెడీ ఫర్‌ కామెడీ.!

By iQlikMovies - January 17, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

తమిళంలో ప్రభుదేవా హీరోగా రూపొందుతోన్న 'చార్లి చాప్లిన్‌ 2' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. చార్లిచాప్లిన్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది నవ్వుల రారాజు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవడమే ఈ సినిమా లక్ష్యం. గతంలో వచ్చిన 'చార్లిచాప్లిన్‌' సినిమా మంచి విజయం అందుకుంది. దానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమే ఈ 'చార్లి చాప్లిన్‌ 2'.

 

ప్రభుదేవా సరసన నిక్కీ గల్రాని, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు ప్రభుతో సహా పలువురు నటీ నటులు ఇతర ముఖ్య తారాగణంగా కనిపించనున్నారు. కామెడీ ఓరియెంటెడ్‌ మూవీ అయినా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందించారు. శక్తి చిదంబంరం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నటుడిగా, డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గానే కాకుండా, అభిరుచి గల చిత్రాలను రూపొందించడంలోనూ ప్రభుదేవా తనదైన ముద్ర వేశాడు.

 

ఆయన హీరోగా నటిస్తున్న ఈ చార్లి చాప్లిన్‌ ఎంతో ప్రత్యేకమైనదిగా ఆయన అభివర్ణిస్తున్నారు. తమిళంతో పాటు, తెలుగు, మలయాళ, కన్నడ తదితర దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. సరికొత్త కామెడీతో ప్రేక్షకుల్ని అలరించేందుకు 'చార్లిచాప్లిన్‌ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు మ్యాట్రిమోని నిర్వాహకుడి పాత్రలో రాకింగ్‌ స్టార్‌ ప్రభుదేవా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS