ప్రతిష్ఠాత్మక చిత్రంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దాంతో రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు'పై ఆశక్తి సన్నగిల్లింది. అంతేకాదు, 'కథానాయకుడు' నిరాశపరచడంతో డైరెక్టర్ క్రిష్, బాలయ్య సందిగ్ధంలో పడ్డారట. వాస్తవానికి సినిమాని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయాల్సి ఉంది. షూటింగ్ అయితే కొంచెమే మిగిలి ఉంది. కానీ 'కథానాయకుడు' రిజల్ట్‌తో 'మహానాయకుడు' సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారట.
'మహానాయకుడు' పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' దూకుడు మీదుంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాతి పరిణామాలు ఏంటీ.? అనే సింగిల్ పాయింట్‌ని టార్గెట్‌గా చేసుకుని వర్మ రూపొందిస్తున్న సినిమా ఇది. పక్కా నా సినిమాలో అన్నీ నిజాలే చూపిస్తాను అని వర్మ ఛాలెంజ్ చేసి మరీ ఈ సినిమాని ప్రారంభించారు. దాంతో వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యింది.
వర్మ సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది. అనుకున్న టైంకే వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని విడుదల చేయడం పక్కా. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలయ్యాక, అసలే ప్రత్యర్థి లేని హీరోయిజంలో పస ఏముంటుంది.? అనే నెగిటివ్ ప్రచారంతో ఎన్టీఆర్ 'మహానాయకుడు'పై ఉన్న ఓ మోస్తరు అంచనాలు కూడా సన్నగిల్లిపోయాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని ఎన్టీఆర్ మహానాయకుడు అసలు ప్రేక్షకుల ముందుకొచ్చేనా.? వస్తే కథలో ఏమైనా మార్పులు చోటు చేసుకొనేనా..? ఏమో ఏం జరుగుతుందో చూడాలిక.