టైటిల్‌ 'సైలెన్స్‌' కానీ.. సౌండింగ్‌ గట్టిగానే.!

By iQlikMovies - January 16, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

మాధవన్‌, అనుష్క జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. 'సైలెన్స్‌' టైటిల్‌తో తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇదో భారీ మల్టీ స్టారర్‌ చిత్రంగా రూపొందిస్తున్నారట. ఎక్కువ భాగం అమెరికాలోనే ఈ సినిమా షూటింగ్‌ జరగనుందట. 

 

అమెరికాలోని భారీ భారీ లొకేషన్స్‌ని షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ సెర్చ్‌ చేస్తోందట. అనుష్కతో పాటు, తెలగమ్మాయి అంజలి, 'అర్జున్‌రెడ్డి' ఫేం షాలినీ పాండే ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ప్రముఖ హాలీవుడ్‌ నటీనటులు ఈ సినిమాలో కనిపించనున్నారనీ సమాచారమ్‌. టెక్నికల్‌గా ఈ సినిమాని హైరేంజ్‌లో రూపొందించనున్నారట. 

 

ఇకపోతే జేజమ్మ అనుష్క 'భాగమతి' సినిమా తర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం అనుష్క చాలా సన్నబడిందట. మాధవన్‌తో అనుష్క చాలా కాలం తర్వాత స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతోంది ఈ సినిమాతో. మార్చిలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. హేమంత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS