'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో డైరెక్టర్‌గా మారాడు హీరో కమ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. అప్పటికే హీరోగా పలు చిత్రాల్లో నటించిన ప్రభుదేవాకి డైరెక్టర్‌గా తొలి సినిమా అయిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రం సూపర్ డూపర్ సక్సెస్‌నిచ్చింది. తర్వాత తర్వాత 'పౌర్ణమి', 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాలను తెరకెక్కించాడు. ఆ రెండూ ఆశించిన ఫలితాలివ్వలేదు. దాంతో తెలుగులో డైరెక్షన్‌కి గుడ్‌బై చెప్పేశాడు.
తమిళంలో కూడా పలు చిత్రాలను డైరెక్ట్ చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. హిందీలో కూడా ప్రభుదేవా దర్శకత్వంలో కొన్ని విజయవంతమైన చిత్రాలున్నాయి. అయితే తాజాగా మరోసారి ప్రభుదేవా తెలుగులో డైరెక్షన్ చేసేందుకు సిద్ధపడుతున్నాడనీ తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాత తెలుగులో ప్రభుదేవా డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడట. ఓ యంగ్ హీరో ఈ సినిమాలో నటించబోతున్నాడట. డాన్సుల్లో దిట్టట ఆ యంగ్ హీరో. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట.
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా తరహాలో మంచి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారనీ తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఓ పక్క హీరోగా, డైరెక్టర్‌గా, డాన్స్ కొరియోగ్రాఫర్‌గా చేస్తూనే, ఇటీవల ఓ సినిమా కోసం విలన్‌గా మారాడు ప్రభుదేవా. అదే 'మెర్క్యురీ' సినిమా. ఇదో ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడు ప్రభుదేవా.