'ప్రగతి' ఆంటీ దుమ్ము రేపింది!

By Inkmantra - April 15, 2020 - 16:08 PM IST

మరిన్ని వార్తలు

క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో 'ప్రగతి' ఒకరు. ఆమె నటించిన పాత్రలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజుల్లో ఏ హీరో తల్లి పాత్రైనా లేదా విలన్ భార్య పాత్రైనా చేయాలంటే.. దర్శకులకు గుర్తుకొచ్చే అతి కొద్ది మందిలో ప్రగతి ఒకరు. ఆవిడ అందం, అభినయం తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ట్రెడిషనల్ పాత్రల్లో ఒదిగిపోవడమే కాకుండా.. అప్పుడప్పుడు కామెడీ సన్నివేశాల్లో కూడా నటించి మెప్పించారు.

 

ఇకపోతే తాజాగా లాక్ డౌన్ లో, స్టే హోమ్ ఛాలెంజ్ తరహాలో 'ప్రగతి' తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ వీడియో లో ఏముంది అనుకుంటున్నారా.? తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తాజా చిత్రం 'మాస్టర్' సినిమాకు సంబంధించిన 'వాతి కమింగ్' అనే పాటకు ఊర మాస్ స్టెప్పులేసింది ప్రగతి. ఆమె ఊపు చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Quarantine tales #vaathicoming #mothersonduo #master💕❤🤪🤪 HAPPY EASTER🤩😍🤩

A post shared by Mahavadi Pragathi (@pragstrong) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS