'ఆచారి' కోసం అమెరికా పాప ఏం చెబుతోందంటే.!

మరిన్ని వార్తలు

కమర్షియల్‌ కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన డైరెక్టర్‌ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బ్రహ్మనందం కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఈ మధ్య బ్రహ్మానందం ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషించిన చిత్రమిది. హిలేరియస్‌ కామెడీతో, కమర్షియల్‌ హంగులతో సినిమాని నిర్మించారు. ఇక ప్రగ్యా జైశ్వాల్‌ విషయానికి వస్తే, 'కంచె' సినిమాతో ప్రిన్సెస్‌లా అందంతో పాటు, హుందాగా కనిపించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తర్వాతర్వాత సూపర్‌ హాట్‌గా కనిపించి మెప్పించింది. అంచలంచెలుగా తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని బయటకి తీసింది. 

అలాగే 'నక్షత్రం' సినిమాలో హాట్‌నెస్‌తో పాటు, పోలీసాఫీసర్‌లా సీరియస్‌ యాక్షన్‌ని కూడా చూపించేసింది. ఈ సినిమాతో తనలోని కామెడీ యాంగిల్‌ని బయటికి తీస్తానంటోంది. తాత అస్థికలు కాశీలో కలిపాలనే ఓ ఎమోషన్‌ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందట. ప్రగ్యా పాత్ర విషయానికి వస్తే, అమెరికా నుండి వచ్చిన ఎన్నారై అమ్మాయిగా ప్రగ్యా కనిపిస్తుందట. 

విష్ణు, ప్రగ్యా మధ్య లవ్‌ట్రాక్‌ చాలా బాగుంటుందనీ, అలాగే విష్ణు, బ్రహ్మానందం మధ్య జరిగే కామెడీ ట్రాక్‌ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుందని అంటోందీ ముద్దుగుమ్మ. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాట్‌ సమ్మర్‌లో 'ఆచారి అమెరికా యాత్ర' కూల్‌ కామెడీని హాయిగా ఆస్వాదించండి అంటోంది ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS