ఆహా.! ఏమంత అందాల ఆదమరుపు.!

మరిన్ని వార్తలు

'కంచె' సినిమాతో తెలుగు తెర ప్రేక్షకుల్ని మంత్ర ముగ్థుల్ని చేసిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌. అంచెలంచెలుగా గ్లామర్‌ కంచెలు తెంచేసిందీ హాట్‌ బ్యూటీ. సినిమా సినిమాకీ తనలోని కొంచెం కొంచెంగా గ్లామర్‌ తెరల్ని ఎక్స్‌పోజ్‌ చేసి చూపించిన ఈ బ్యూటీకి 'కంచె' తర్వాత ఆ స్థాయిలో ఆశించదగ్గ హిట్‌ పడలేదు. సినిమాలు చేస్తోంది కానీ, హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో రిజిస్టర్‌ కావడం లేదు. కాగా వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న 'అంతరిక్షం' సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం ఈ ముద్దుగుమ్మని ఆఫర్‌ చేశారనీ తెలుస్తోంది. నిడివి తక్కువ ఉన్నా, ఈ క్యారెక్టర్‌ ప్రగ్యాకి మంచి పేరు తీసుకొస్తుందట. చూడాలి మరి, తొలి హిట్‌ ఇచ్చిన హీరో మెగా ప్రిన్స్‌తోనే మళ్లీ ప్రగ్యా జైశ్వాల్‌ సక్సెస్‌ అందుకుంటుందేమో చూడాలి మరి. సినిమాల సంగతి అటుంచితే, సోషల్‌ మీడియాలో అమ్మడు రీల్‌ లైఫ్‌కి సంబంధం లేకుండా కొన్ని హాట్‌ పిక్స్‌ని పోస్ట్‌ చేస్తుంటుంది. వాటికి బోలెడంత మంది ఫ్యాన్‌ ఫాలోయింగా ఉంది కూడా. అందులో భాగంగానే ప్రగ్యా పోస్ట్‌ చేసిన ఈ తాజా పిక్‌ మీకోసం. ఆదమరిచిన ఏదో ఆలోచిస్తున్న ఆమె అందాల్ని వర్ణించ తరమా అనిపిస్తోంది కదా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS