యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కిన 'సాహో' చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించకపోవడంతో ప్రభాస్ తన తరువాత సినిమా జాన్ పై దృష్టి పెట్టాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర ఓ మ్యూజిక్ టీచర్ గా కనిపించనుండదట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్ను పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆమె లుక్ పై కసరత్తు మొదలు పెట్టారట. ప్రభాస్ నటించిన 'ఏ నిరంజన్' లో కూడా హీరాయిన్ మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపిస్తుంది. ఇప్పుడు జాన్ లో కూడా పూజ అలంటి పాత్ర చేయబోతుంది. అయితే దీని పై ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికి ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో పూజా 90ల నాటి కాలేజ్ గర్ల్ గెటప్ లో అలరించారు. మరి జాన్ చిత్రంలో ఆమె ఎలా ఉంటారో చూడాలి. కాగా ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కూడా రెండు గెటప్స్ లో కనిపిస్తారట. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభాస్ వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనికుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. సినిమాలో వింటేజ్ కార్లకు ప్రభాస్ కు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయట.
ఇక జాన్ లో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడట ప్రభాస్. ఆ దిశగా రైటర్స్ చేత స్క్రిప్ట్ వర్క్ కూడా చేయిస్తోన్నట్లు తెలుస్తోంది. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.